: నేను సిన్సియర్ గా సేవ చేస్తుంటే గుర్తించడం లేదు: సోనియాకు శశిథరూర్ ఘాటు లేఖ


"నేను సిన్సియర్ గా కాంగ్రెస్ పార్టీకి సేవ చేస్తుంటే, దాన్ని గుర్తించడం లేదు" అంటూ, ఆ పార్టీ నేత, మాజీ మంత్రి శశి థరూర్ సోనియా గాంధీకి లేఖ రాశారు. బ్రిటిష్ పాలనపై ఆక్స్ ఫర్డ్ యూనివర్శిటీలో ప్రసంగించిన శశి థరూర్ ను ప్రధాని మోదీ అభినందించిన కొన్ని రోజుల తరువాత శశి లేఖ రాయడం కొత్త చర్చకు దారితీసింది. ఇటీవల కాంగ్రెస్ పార్టీ సమావేశంలో శశి వైఖరిని సోనియా ఆక్షేపించారు. పార్లమెంటులో కాంగ్రెస్ వ్యూహాలను ముందుగానే ఆయన బయటకు వెల్లడించారన్న వార్తల నేపథ్యంలో, సోనియా ఆయనపై ఆగ్రహాన్ని వ్యక్తం చేసిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో శశి థరూర్ లేఖ రాయడం, అందులో వివాదాస్పద వ్యాఖ్యలు చేయడం గమనార్హం. పార్టీలో తనను ఒంటరిని చేసే ప్రయత్నాలు జరుగుతున్నాయని కూడా ఆయన ఆరోపించారు. కాంగ్రెస్ పార్టీపై తన నిబద్ధతను అపార్థం చేసుకుంటున్నారని, తన శక్తిమేరకు కృషి చేస్తున్నప్పటికీ, ఆరోపణలు వస్తున్నాయని ఆయన అన్నారు. తాను పార్టీ వైఖరి పట్ల అసంతృప్తిగా ఉన్నానని తెలిపారు. కాగా, శశి థరూర్ కాంగ్రెస్ కు దూరమవుతూ, మోదీకి దగ్గరగా జరుగుతున్నారని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు.

  • Loading...

More Telugu News