: పంథా మార్చుకోవాలని భావించడం లేదు: కోహ్లీ


టీమిండియా టెస్టు సారథి విరాట్ కోహ్లీ శ్రీలంక టూర్ కు సన్నద్ధమవుతున్నాడు. ఇండియా-ఎ, ఆసీస్-ఎ జట్ల మధ్య చెన్నైలో జరిగిన అనధికార టెస్టులో కోహ్లీ పెద్దగా రాణించలేదు. తొలి ఇన్నింగ్స్ లో 16, రెండో ఇన్నింగ్స్ లో 45 పరుగులు చేశాడు. ఈ మ్యాచ్ లో ఇండియా-ఎ జట్టు దారుణంగా ఓడిపోయింది. కాగా, కోహ్లీ మీడియాతో మాట్లాడుతూ... జట్టు విజయం కోసం ఎప్పుడూ బాధ్యతగానే ఆడతానని తెలిపాడు. ఓ బ్యాట్స్ మన్ గా జట్టును గెలిపించేందుకే ప్రయత్నిస్తానని, అందుకోసం తన పంథా మార్చుకోవాలని భావించడం లేదని పేర్కొన్నాడు.

  • Loading...

More Telugu News