: వెంకయ్య గొంతు మూగబోయిందేం?: శైలజానాథ్ ప్రశ్న


పార్లమెంటులో ఆంధ్రప్రదేశ్ పునర్వ్యవస్థీకరణ బిల్లు ఆమోదం సందర్భంగా పదేళ్లు ప్రత్యేకహోదా కావాలంటూ డిమాండ్ చేసిన కేంద్ర మంత్రి వెంకయ్యనాయుడు గొంతు ఇప్పుడు ఎందుకు మూగబోయిందని మాజీ మంత్రి శైలజానాథ్ ప్రశ్నించారు. హైదరాబాదులో ఆయన మాట్లాడుతూ, అధికారంలో లేరు కాబట్టి పదేళ్లు ప్రత్యేకహోదా కావాలని డిమాండ్ చేశారు... అధికారంలో ఉన్నారు కనుక ప్రత్యేకహోదా ఇవ్వమని చెబుతున్నారా? అని నిలదీశారు. రాజ్యసభలో కంగు కంగుమని వినపడే వెంకయ్య నాయుడు గొంతు ప్రత్యేకహోదాపై ఎందుకు ప్రశ్నించడం లేదని అన్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు రాష్ట్రానికి న్యాయం చేయలేరని స్పష్టమైందని ఆయన తెలిపారు. కేంద్రంలో భాగస్వామిగా ఉన్న చంద్రబాబునాయుడు ఒత్తిడి తెస్తే ప్రత్యేకహోదా సాధ్యమయ్యేదని ఆయన అభిప్రాయపడ్డారు. ఆంధ్రప్రదేశ్ కు ప్రత్యేకహోదా కోసం ప్రధాని మోదీ, బీజేపీపై టీడీపీకి చెందిన కేంద్ర మంత్రులు, టీడీపీ ఎంపీలు ఒత్తిడి తీసుకురావాలని ఆయన సూచించారు. టీడీపీ నేతలు ఏపీకి ప్రత్యేకహోదాపై మోదీ, రాజ్ నాథ్, అమిత్ షా ఇళ్ల ముందు ఆందోళన చేపడతారో లేదో తెలియజేయాలని ఆయన డిమాండ్ చేశారు.

  • Loading...

More Telugu News