: పవన్ ఏ పక్షమో చెప్పాలి!: బొత్స


ప్రత్యేక హోదా అంశం రాష్ట్ర ప్రయోజనాలకు సంబంధించినదని, అందరూ సహకరించాలని వైఎస్సార్సీపీ నేత బొత్స సత్యనారాయణ పిలుపునిచ్చారు. ప్రజల కోసం ఉన్నానని చెబుతున్న పవన్ కల్యాణ్ ప్రతిపక్షమో, అధికార పక్షమో చెప్పాలని డిమాండ్ చేశారు. ప్రత్యేక హోదాపై పోరులో అందరినీ కలుపుకుని ముందుకువెళ్లాలన్నదే తమ అభిమతమని స్పష్టం చేశారు. ఏపీకి ప్రత్యేక హోదా కోసం ఈ నెల 10న ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద తమ పార్టీ దీక్ష నిర్వహిస్తుందని, ఇందులో జగన్ కూడా పాల్గొంటారని బొత్స వివరించారు. దీక్ష ముగిసిన తర్వాత పార్లమెంట్ వరకు పాదయాత్ర ఉంటుందని తెలిపారు. ఇక, టీడీపీ ఎంపీలపై ఆయన ధ్వజమెత్తారు. ప్రత్యేక హోదా సాధించకుంటే ప్రజలు బట్టలూడదీస్తారని హెచ్చరించారు. జేసీ దివాకర్ రెడ్డి వ్యాఖ్యలపై చంద్రబాబు ఏం సమాధానం చెబుతారని ప్రశ్నించారు.

  • Loading...

More Telugu News