: ఒబామాను కలవనున్న అమీర్ ఖాన్
బాలీవుడ్ నటుడు అమీర్ ఖాన్ త్వరలో అమెరికా అధ్యక్షడు బరాక్ ఒబామాను కలవనున్నాడు. 'టైమ్స్ మ్యాగజైన్' తాజాగా ప్రకటించిన ప్రపంచంలోని 100 మంది ప్రభావవంతుల జాబితాలో, టైమ్స్ కవర్ పేజ్ పై అమీర్ మెరిశాడు. ఇదే జాబితాలో నాయకుల కేటగిరీలో ఒబామా మూడవస్థానంలో నిలిచారు. ఈ నేపథ్యంలో ఈనెల 23న భారీ విందు నిర్వహించనున్నారు. ఈ కార్యక్రమానికి విచ్చేయమని బాలీవుడ్ మిస్టర్ పర్ ఫెక్ట్ అమీర్ కు కూడా ఆహ్వానం అందిందట. ఇంకేముంది... రెక్కలు కట్టుకుని న్యూయార్క్ లో వాలిపోతున్నాడు అమీర్. ఆ సందర్భంగా ఒబాను ఈ హీరో కలుస్తాడట.