: ఏపీకి 'హోదా' తప్పకుండా వస్తుంది... సుజనా చౌదరి ధీమా
ఇప్పట్లో ఏ రాష్ట్రానికీ ప్రత్యేక హోదా ఇచ్చే ప్రశ్నే లేదని సాక్షాత్తూ కేంద్ర ప్రభుత్వమే స్పష్టం చేసినప్పటికీ, ఆ మంత్రిమండలి సభ్యుడు సుజనా చౌదరి మాత్రం ఏపీకి తప్పకుండా హోదా వస్తుందంటున్నారు. రఘురాం రాజన్ కమిషన్ 2011లో ఇచ్చిన నివేదిక ఆధారంగానే కేంద్రమంత్రి పార్లమెంట్ లో ప్రత్యేక హోదాపై సమాధానమిచ్చారని చెప్పారు. ఆ కమిషన్ నివేదిక సమయానికి రాష్ట్రం విడిపోలేదని, ప్రస్తుత ప్రత్యేక పరిస్థితులు వేరన్నారు. ఈ నేపథ్యంలో రాష్ట్రానికి హోదా రావడం ఖాయమని ధీమా వ్యక్తం చేశారు. ఇదే సమయంలో హోదా కోసం ఢిల్లీలో దీక్ష చేస్తానంటున్న జగన్ పై మంత్రి మండిపడ్డారు. సమావేశాల చివరలో దీక్ష చేయటమేంటని అడిగారు.