: రాజమండ్రి తొక్కిసలాట ఘటన ఇప్పటికీ బాధ కలిగిస్తోంది: చంద్రబాబు
తూర్పుగోదావరి జిల్లా రాజమండ్రిలో పుష్కరాల సందర్భంగా జరిగిన తొక్కిసలాట ఘటనపై సీఎం చంద్రబాబు మరోసారి విచారం వ్యక్తం చేశారు. తొలిరోజే చోటు చేసుకున్న తొక్కిసలాట ఘటన ఇప్పటికీ ఎంతో బాధ కలిగిస్తోందన్నారు. ఆ సమయంలో 27 మంది చనిపోవడం బాధాకరమని చెప్పారు. గోదావరి పుష్కరాలను చాలా ప్రతిష్ఠాత్మకంగా తీసుకుని చేశామని విజయవాడలో జరుగుతున్న టీడీపీ విస్తృత స్థాయి సమావేశంలో పేర్కొన్నారు. ప్రజల జీవన ప్రమాణాలు పెరగడానికి ప్రజాప్రతినిధులంతా కృషి చేయాలని సీఎం సూచించారు. గోదావరి నీటిని సమర్థవంతంగా ఉపయోగించుకుంటే చాలా కష్టాలు తీరతాయని అని చెప్పిన చంద్రబాబు, ప్రస్తుతం జరుగుతున్న విస్తృత స్థాయి సమావేశానికి ఎంతో ప్రాధాన్యత ఉందని తెలిపారు.