: తెలంగాణలో సీఎం రిలీఫ్ ఫండ్ నుంచి ఆర్థిక సాయానికి బ్రేకులు... నాలుగు రోజులుగా నిలిచిన చెల్లింపులు
తెలంగాణలో ముఖ్యమంత్రి సహాయ నిధి (సీఎం రిలీఫ్ ఫండ్)పై ప్రభుత్వం ఆంక్షలు విధించింది. గడచిన నాలుగు రోజులుగా ఈ ఖాతా నుంచి చెల్లింపులను ప్రభుత్వం నిలిపివేసింది. దీంతో ఆరోగ్యశ్రీ కార్డులు లేని పేద రోగులు నానా అవస్థలు పడుతున్నారు. ఇన్నాళ్లు ఆరోగ్యశ్రీ కార్డులు లేని నిరుపేదలకు ప్రాణాపాయ పరిస్థితులు ఎదురైతే, కేవలం వారివారి ఎమ్మెల్యేల సిఫారసుతో సీఎం రిలీఫ్ ఫండ్ ఆదుకుంటున్న విషయం తెలిసిందే. అయితే ఈ తరహా చెల్లింపులను తెలంగాణ ప్రభుత్వం నాలుగు రోజుల క్రితం నిలిపివేసింది. ఈ చెల్లింపుల నిలిపివేత తాత్కాలికమా? లేక శాశ్వతమా? అన్న విషయంపై ఉన్నతాధికారుల వద్ద కూడా సరైన సమాధానం లభించడం లేదు.