: యెమన్ లో భారత రాయబార కార్యాలయం లేదు... ఆ దేశానికి వెళ్లకండి: సుష్మాస్వరాజ్


యెమెన్ లో భారత రాయబార కార్యాలయం లేదని కేంద్ర విదేశాంగ శాఖ మంత్రి సుష్మాస్వరాజ్ ట్విట్టర్లో స్పష్టం చేశారు. చాలా మంది భారతీయ నర్సులు ఉపాధి నిమిత్తం యెమెన్ కు వెళ్తున్నారని...ఇది ఆందోళన కల్గించే విషయమని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. యెమెన్ లో పరిస్థితులు బాగా లేవని, అందువల్ల అక్కడికి వెళ్లే ప్రయత్నం విరమించుకోవాలని ఆమె హితవు పలికారు. కాగా, గతంలో భారత ప్రభుత్వం యెమెన్ రాజకీయ పరిస్థితుల్లో సంభవించిన మార్పులను గమనించి, భారతీయులు తక్షణం స్వదేశం రావాలని ఆదేశించిన సంగతి తెలిసిందే.

  • Loading...

More Telugu News