: చైనాలో జరిగే కీలక సదస్సుకు రావాలంటూ కేసీఆర్ కు ఆహ్వానం


తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కె.చంద్రశేఖరరావుకు వరల్డ్ ఎకనామిక్ ఫోరం నుంచి ఆహ్వానం అందింది. చైనాలో జరిగే 'న్యూ చాంపియన్స్-2015' సదస్సుకు రావాలంటూ వరల్డ్ ఎకనామిక్ ఫోరం ప్రాంతీయ వ్యవహారాల విభాగం అధిపతి ఫిలిప్ రోస్లర్ సీఎం కేసీఆర్ కు లేఖ రాశారు. ఈ కార్యక్రమానికి ప్రపంచం నలుమూలల నుంచి వ్యాపార, ప్రభుత్వ, పరిశోధన, మీడియా రంగాలకు చెందిన 1500 మంది ప్రముఖులు వస్తారని భావిస్తున్నామని రోస్లర్ పేర్కొన్నారు. ఈ సదస్సు చైనాలోని దలియాన్ లో సెప్టెంబర్ 9 నుంచి 11 వరకు జరగనుంది. ప్రపంచం ఎదుర్కొంటున్న పలు సమస్యలను ఈ సదస్సులో చర్చించనున్నారు. సైన్స్-టెక్నాలజీ, ఆవిష్కరణలకు సంబంధించిన అంశాలపై తాజా ప్రతిపాదనలు, సిద్ధాంతాలు కూడా సదస్సు అజెండాలో ఉన్నాయి.

  • Loading...

More Telugu News