: ఓ మహిళ మరో మహిళ తల నరికేసింది...వెలుగులోకి వచ్చిన ఐఎస్ఐఎస్ కిరాతకం
ఐఎస్ఐఎస్ కిరాతకాలకు అంతులేకుండాపోతోంది. ఐఎస్ఐఎస్ చెర నుంచి తప్పించుకున్న ఓ బాలిక ఐఎస్ దురాగతాలను బాహ్యప్రపంచానికి వెల్లడించింది. సిరియా రాజధాని డెమాస్కస్ లో చోటుచేసుకున్న ఈ దారుణం వివరాల్లోకి వెళితే... టునిషి అనే మహిళ షరియా జడ్జిగా పని చేస్తోంది. ఇటీవలే ఆమె భర్త మరణించాడు. దీంతో షరియా చట్టం ప్రకారం రెండో వివాహం చేసుకోవాలంటూ ఐఎస్ఐఎస్ ఆమెపై ఒత్తిడి తీసుకొచ్చింది. అయితే, రెండో వివాహానికి అంగీకరించిన ఆమె ఐఎస్ఐఎస్ కు ఓ షరతు విధించింది. ఒక మహిళ తల నరికేతే కానీ తాను మళ్లీ పెళ్లి చేసుకోనని ఆమె పెట్టిన కండిషన్ కు ఐఎస్ఐఎస్ నేత అబుల్ బకర్ అల్ బగ్దాదీ అంగీకరించాడు. షరతు ప్రకారం, వివాహేతర సంబంధం పెట్టుకున్న ఓ మహిళ తలను టునిషి అత్యంత పాశవికంగా నరికింది. ఇదే కాదు, ఇలాంటి ఘటనలు లెక్కకు మిక్కిలిగా సిరియాలో జరుగుతున్నాయని ఆ బాలిక తెలిపింది. వివాహానికి ముందే లైంగిక సంబంధం కలిగి ఉన్న ఓ యువతిని బెత్తంతో 80 సార్లు కొట్టారని వెల్లడించింది. వాట్సాప్ లో చాట్ చేసిందని ఓ బాలికను రక్తమోడేలా కొట్టారట. ఇలా చెప్పుకుంటూ పోతే ఐసిస్ అరాచకాలకు అంతులేకుండా పోతోందని ఆ బాలిక వెల్లడించింది.