: మోదీ సీటు ముందు నిరసన వ్యక్తం చేసిన టీఆర్ఎస్ ఎంపీలు


తెలంగాణకు ప్రత్యేక హైకోర్టు ఏర్పాటు చేయాలని డిమాండ్ చేస్తూ టీఆర్ఎస్ ఎంపీలు తమ ఆందోళనను తీవ్రతరం చేశారు. ఈ మేరకు ఈనాటి పార్లమెంటు సమావేశాల్లో నినాదాలు చేశారు. అనంతరం, లోక్ సభలో ఏకంగా ప్రధాని నరేంద్ర మోదీ సీటు ముందుకు వెళ్లి నిలబడి మౌనంగా తమ నిరసన వ్యక్తం చేశారు. గత పార్లమెంటు సమావేశాల్లో కూడా టీఆర్ఎస్ ప్రత్యేక హైకోర్టు కోసం ఆందోళన చేసింది. ప్రత్యేక హైకోర్టు లేకపోతే తెలంగాణకు న్యాయం జరగదని టీఆర్ఎస్ ఎంపీలు ఆరోపించారు.

  • Loading...

More Telugu News