: ఆగస్ట్ 10వ తేదీలోగా ప్రత్యేక హోదా ఇవ్వండి... లేకపోతే, 11వ తేదీన బంద్!: సీపీఐ
రాష్ట్ర విభజన సమయంలో హామీ ఇచ్చిన విధంగా ఏపీకి ప్రత్యేక హోదా ఇవ్వాల్సిందే అని సీపీఐ ఏపీ కార్యదర్శి కె.రామకృష్ణ డిమాండ్ చేశారు. ఆగస్ట్ 10వ తేదీ లోపల ప్రత్యేక హోదా ప్రకటించాలని, లేకపోతే 11వ తేదీన బంద్ నిర్వహిస్తామని తెలిపారు. అంతేకాకుండా, ప్రత్యేక హోదాను డిమాండ్ చేస్తూ శ్రీకాకుళం జిల్లా నుంచి హిందూపురం వరకు బస్సు యాత్ర నిర్వహిస్తామని తెలిపారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఎంతో అవసరమైనప్పటికీ కేంద్ర ప్రభుత్వం ఎందుకు వెనకడుగు వేస్తోందని ప్రశ్నించారు.