: బయ్యారంలో పరిశ్రమ పెట్టాల్సిందే: నామా
బయ్యారంలో స్టీల్ ప్లాంట్ ఏర్పాటు చేయాల్సిందే అని టీడీపీ ఎంపీ నామా నాగేశ్వరరావు అంటున్నారు. కర్మాగారం నిర్మాణం అంశంపై తెలుగుదేశం పార్టీ వెనక్కితగ్గదని నామా సర్కారుకు స్పష్టం చేశారు. పనిలోపనిగా నామా.. కేసీఆర్ పై విరుచుకుపడ్డారు. బయ్యారం విషయమై కేసీఆర్ ఎన్నడూ లోక్ సభలో నోరు విప్పలేదని విమర్శించారు. తెలంగాణ సంపదను దోచుకుంటున్నా కిమ్మనకుండా ఉంటోన్న కేసీఆర్ వల్ల ఒరిగేదేమీలేదని నామా వ్యాఖ్యానించారు. బయ్యారం గనులను రక్షణ స్టీల్స్ కు కేటాయించడంపై తాము అభ్యంతరం చెబితే, అప్పట్లో కేసీఆర్ మౌనంగా ఉన్నారని తెలిపారు.