: ఏపీకి ప్రత్యేక హోదా హుళక్కే!... కొత్తగా ఏ రాష్ట్రానికీ ‘హోదా’ ఇవ్వబోమన్న కేంద్రం


రాష్ట్ర విభజన తర్వాత తీవ్ర ఆర్థిక సంక్షోభంలో కూరుకుపోయిన ఆంధ్రప్రదేశ్ కు కేంద్రం మొండి చెయ్యి చూపేలా ఉంది. ఇప్పటికే ప్రకటించిన మేరకు నిధులను విదల్చడంలో ఆచిచూచి వ్యవహరిస్తున్న కేంద్రం తాజాగా రాష్ట్రాలకు ప్రత్యేక హోదా ఇవ్వబోమని కూడా ఇదివరకే ప్రకటించిన సంగతి తెలిసిందే. తాజాగా ఇదే మాటను మరోమారు పునరుద్ఘాటించింది. కొత్తగా ఏ రాష్ట్రానికి కూడా ప్రత్యేక హోదా ఇచ్చే ప్రసక్తే లేదని కొద్దిసేపటి క్రితం పార్లమెంటు సాక్షిగా కేంద్ర మంత్రి ఇంద్రజిత్ సింగ్ ప్రకటించారు. దీంతో ఏపీకి ప్రత్యేక హోదా ఇవ్వబోమని కేంద్రం వెల్లడించినట్లైంది. దీనిపై ఏపీ నేతలు ఏ విధంగా స్పందిస్తారో చూడాలి.

  • Loading...

More Telugu News