: ఎలుక భయం... ఎయిర్ ఇండియా విమానాన్ని వెనక్కు తిప్పేసిందట!


నిండా ప్రయాణికులతో ఆకాశయానానికి వెళ్లిన ఓ విమానం నాలుగు గంటల తర్వాత తిరిగి వెనక్కు వచ్చి, బయలుదేరిన చోటులోనే దిగేసింది. కారణమేంటంటే, విమానం పైలట్ క్యాబిన్ లో ఎలుక ఉందేమోనన్న భయమేనట. వివరాల్లోకెళితే... 200 మంది ప్రయాణికులతో నేటి ఉదయం న్యూఢిల్లీ నుంచి మిలాన్ బయలుదేరిన ఎయిర్ ఇండియా ఏఐ-123 విమానం నాలుగు గంటల తర్వాత టేకాఫ్ తీసుకున్న చోటే ల్యాండయ్యింది. టేకాఫ్ తీసుకుని దాదాపు రెండు గంటల పాటు ప్రయాణించిన సదరు విమానంలో ఉన్నట్టుండి ఎలుక ఉందేమోనన్న భయం పైలట్ ను వేధించింది. అసలు నిజంగా ఎలుక అక్కడ ఉందో, లేదో కూడా ఆ పైలట్ నిర్ధారించుకోలేదట. కీలక వైర్లను ఎలుక కొరికేస్తే పరిస్థితి ఏంటని ఆ పైలట్ భయాందోళనకు గురయ్యాడు. అక్కడికక్కడే విమానాన్ని దించేద్దామంటే, ఆ గగనతలం శత్రుదేశం పాకిస్థాన్ ది. ఎలాగోలా గమ్యస్థానం చేరుదామంటే, మిలాన్ నగరం అక్కడికి చాలా దూరంలో ఉంది. దీంతో ఆ పైలట్ విమానాన్ని ఉన్నపళంగా వెనక్కు తిప్పేశాడు. తిరిగి రెండు గంటల పాటు ప్రయాణించిన ఆ విమానం న్యూఢిల్లీలో ల్యాండైంది. పైలట్ చెప్పిన కారణం విని అధికారులు నోరెళ్లబెట్టారట. ఆనక తేరుకుని విచారణకు ఆదేశాలు జారీ చేశారు.

  • Loading...

More Telugu News