: రూ. 2.14 లక్షల కోట్ల పన్ను ఎగ్గొట్టిన 17 మంది


ఆ 17 మందీ కోటీశ్వరులే! ఒక్కొక్కరి వద్ద రూ. 1000 కోట్లకు పైగా ఆస్తులున్నాయి. అయితేనేం... డబ్బు ఇంకా సమకూర్చుకోవాలన్న దురాశ. ప్రభుత్వానికి కట్టాల్సిన ఆదాయపు పన్నును కట్టడం లేదు. కోటి, రెండు కోట్లు కాదు, ఏకంగా రూ. 2.14 లక్షల కోట్లను ఎగ్గొట్టారు. ఈ విషయాన్ని రాజ్యసభకు పంపిన లిఖితపూర్వక సమాధానంలో ఆర్థిక శాఖ సహాయమంత్రి జయంత్ సిన్హా తెలిపారు. 35 కంపెనీల నుంచి పన్ను రూపంలో రూ. 90,568 కోట్లు రావాల్సి వుందని కూడా ఆయన తెలిపారు. రూ. 10 కోట్ల రూపాయలకు పైగా పన్ను బకాయిలు చెల్లించాల్సిన వారి సంఖ్య 4,692గా ఉందని వివరించారు. 2013-14తో పోలిస్తే ఈ సంఖ్య 69 శాతం అధికమని తెలిపారు. ఈ పన్ను బకాయిలను వసూలు చేసేందుకు అధికారులు ప్రయత్నిస్తున్నారని సిన్హా తెలియజేశారు.

  • Loading...

More Telugu News