: టి.స్పీకర్ ను కలసిన మర్రి శశిధర్ రెడ్డి... తలసానిపై చర్యలు తీసుకోవాలని వినతి


కాంగ్రెస్ సీనియర్ నేత మర్రి శశిధర్ రెడ్డి కొద్దిసేపటి కిందట తెలంగాణ స్పీకర్ మధుసూదనాచారిని కలిశారు. తెలంగాణ ప్రభుత్వంలో మంత్రిగా కొనసాగుతున్న తలసాని శ్రీనివాస్ యాదవ్ పై చర్యలు తీసుకోవాలని ఆయన కోరారు. టీడీపీ తరపున ఎమ్మెల్యేగా గెలిచిన తలసాని టీఆర్ఎస్ లో చేరి మంత్రిగా ఎలా కొనసాగుతారంటూ ప్రతిపక్షాలు ప్రశ్నిస్తున్న సంగతి తెలిసిందే. అంతేకాదు ఆయనపై చర్యలు తీసుకునే విధంగా గవర్నర్ ను ఆదేశించాలంటూ కొన్ని రోజుల కిందట మర్రి కేంద్ర ప్రభుత్వానికి లేఖ కూడా రాశారు. ఎటువంటి స్పందన రాకపోవడంతో తాజాగా స్పీకర్ ను కలిసి చర్చిస్తున్నారు.

  • Loading...

More Telugu News