: రేవంత్ రెడ్డికి ఎదురు దెబ్బ!... బెయిల్ షరతుల సడలింపునకు హైకోర్టు ససేమిరా
ఓటుకు నోటు కేసు ప్రధాన నిందితుడు, టీ టీడీఎల్పీ ఉపనేత రేవంత్ రెడ్డికి నిన్న హైకోర్టులో ఎదురుదెబ్బ తగిలింది. నియోజకవర్గం వీడరాదంటూ విధించిన బెయిల్ షరతులను సడలించాలని ఆయన దాఖలు చేసుకున్న పిటిషన్ ను హైకోర్టు కొట్టివేసింది. తెలుగు దేశం పార్టీ శాసనసభా పక్ష ఉపనేతగా ఉన్నందున హైదరాబాదుకు తాను తరచూ వెళ్లాల్సిన అవసరముందని రేవంత్ రెడ్డి తన పిటిషన్ లో పేర్కొన్నారు. ఈ కారణంగా కొడంగల్ దాటి బయటకు రాకూడదన్న షరతును తొలగించాలని ఆయన కోర్టును అభ్యర్థించారు. అయితే దీనికి తెలంగాణ ఏసీబీ తరఫు న్యాయవాది అభ్యంతరం వ్యక్తం చేశారు. హైదరాబాదుకు వస్తే రేవంత్ రెడ్డి సాక్షులను ప్రభావితం చేస్తారని ఆయన కోర్టుకు ఫిర్యాదు చేశారు. ఏసీబీ న్యాయవాది వాదనతో ఏకీభవించిన న్యాయమూర్తి రేవంత్ రెడ్డి పిటిషన్ ను కొట్టివేశారు.