: డ్యాన్సర్ గా ఇర్ఫాన్ పఠాన్... ముద్దుగుమ్మతో కలిసి ‘కలర్స్’లో స్టెప్పులు
టీమిండియాకు సిసలైన ఆల్ రౌండర్ గా ఎదుగుతున్నాడనుకున్న ఇర్ఫాన్ పఠాన్, అంతలోనే కనుమరుగయ్యాడు. అతడి సోదరుడు యూసుఫ్ పఠాన్ కూడా అడపాదడపా తప్పిస్తే క్రికెట్ గ్రౌండ్ లో కనిపించడం లేదు. మరి ఇర్ఫాన్ పఠాన్ ఏం చేస్తున్నాడు?... ‘కలర్స్’ టీవీ చానెల్ లో స్టెప్పులేస్తున్నాడు. నిజమండీ బాబూ, నిన్న ఆ టీవీ చానెల్ లో ప్రసారమైన ‘ఝలక్ దిఖలాజా’ కార్యక్రమంలో ఓ ముద్దుగుమ్మతో కలిసి ఇర్ఫాన్ డ్యాన్స్ చేశాడు. క్రికెట్ గ్రౌండ్ లో క్లీన్ షేవ్ గా కనిపించిన ఇర్ఫాన్, టీవీ ప్రొగ్రామ్ లో మాత్రం సోదరుడు యూసుఫ్ లా కాస్తంత గడ్డంతో కనిపించాడు.