: మరణశిక్షను రద్దు చేయాలంటున్న డీఎంకే... రాజ్యసభలో కనిమొళి ప్రైవేట్ మోషన్
1993 ముంబై బాంబు పేలుళ్ల కేసులో దోషిగా తేలిన యాకుబ్ మెమన్ కు ఉరి శిక్ష అమలు నేపథ్యంలో మరణశిక్షపై దేశవ్యాప్తంగా చర్చకు తెర లేచింది. ఉగ్రవాద దాడుల నిందితులకు ఉరే సరి అని కొన్ని వర్గాలు వాదిస్తుండగా, ఈ శిక్షను రద్దు చేయాల్సిందేనని మరికొన్ని వర్గాలు డిమాండ్ చేస్తున్నాయి. తమిళనాడులో ప్రతిపక్ష పార్టీ ద్రవిడ మున్నేట్ర కజగం (డీఎంకే) రెండో వాదనకు ఓటేసింది. ఈ మేరకు పార్టీ చీఫ్ కరుణానిధి తనయ, రాజ్యసభ సభ్యురాలు కనిమొళి మరణశిక్షను రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ రాజ్యసభలో ప్రైవేట్ మోషన్ ను దాఖలు చేశారు. దీనిపై నేడు చర్చ జరిగే అవకాశాలున్నట్లు సమాచారం.