: పుణే ఫిల్మ్ ఇన్ స్టిట్యూట్ విద్యార్థుల లేఖకు స్పందించిన రాహుల్
పుణేలోని ఫిల్మ్ అండ్ టెలివిజన్ ఇన్ స్టిట్యూట్ (ఎఫ్ టీఐఐ) విద్యార్థులు రాసిన లేఖకు కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ స్పందించారు. ఎఫ్ టీఐఐకి గజేంద్ర చౌహాన్ ను చైర్మన్ గా ఎంపిక చేయడం పట్ల విద్యార్థులు కొంతకాలంగా ఆందోళన చేస్తున్నారు. ఈ విషయంపై స్పందించాలంటూ ఫిల్మ్ ఇన్ స్టిట్యూట్ విద్యార్థులు రాహుల్ గాంధీకి లేఖ రాశారు. దీనిపట్ల సానుకూలంగా స్పందించిన రాహుల్ గాంధీ విద్యార్థులకు మద్దతివ్వాలని నిర్ణయించుకున్నారు. ఈ క్రమంలో శుక్రవారం పుణే వెళ్లి ఫిల్మ్ ఇన్ స్టిట్యూట్ విద్యార్థులతో ఆయన మాట్లాడనున్నారు.