: యాంగ్రీ బర్డ్స్-2 వచ్చేసిందోచ్!
చిన్నోళ్లు, పెద్దోళ్లు తేడా లేకుండా అందరూ ఇష్టపడి ఆడిన గేమ్ 'యాంగ్రీ బర్డ్స్'. దీనికి సరికొత్త హంగులను జోడిస్తూ 'యాంగ్రీ బర్డ్స్-2'ను రోవియో సంస్థ అందుబాటులోకి తెచ్చింది. ప్రస్తుతానికి ఆండ్రాయిడ్ ఆధారిత ఆపరేటింగ్ సిస్టమ్ ఉన్న ఫోన్లలో మాత్రమే ఈ గేమ్ అందుబాటులో ఉంటుందని సంస్థ తెలిపింది. పాత యాంగ్రీ బర్డ్స్ కు మరిన్ని మెరుగులతో, కొత్త క్యారెక్టర్లు, పలు రకాల మోడ్ లను ప్రవేశపెట్టామని సంస్థ ప్రకటించింది. దీని టీజరును విడుదల చేసింది. యూ ట్యూబ్ లో విడుదలైన యాంగ్రీ బర్డ్స్ టీజర్ ను నెటిజన్లు శరవేగంగా చూసేస్తున్నారు. మరి, మీరు చూశారా?