: విజయవాడలో సీఎం క్యాంప్ ఆఫీస్ ఓఎస్డీగా కృష్ణమోహన్ నియామకం
ఇక నుంచి విజయవాడ నుంచే ఏపీ పరిపాలనంతా కొనసాగించాలని సీఎం చంద్రబాబు నిర్ణయించుకున్నారు. అందుకే రేపు కేబినెట్ భేటీ కూడా అక్కడే నిర్వహించబోతోంది. మరోవైపు త్వరలో విజయవాడలో సీఎం క్యాంప్ ఆఫీస్ ను ఏర్పాటు చేయబోతున్నారు. దానికి ముందుగానే ఓఎస్డీగా కృష్ణమోహన్ ను నియమిస్తూ ప్రభుత్వం ఈ రోజు ఉత్తర్వులు జారీ చేసింది.