: బీజేపీలో చేరడం తొందరపాటు చర్య: జగ్గారెడ్డి


కాంగ్రెస్ ను వీడి బీజేపీ లో చేరడం తొందరపాటు చర్య అని తెలంగాణ రాజకీయ నేత జగ్గారెడ్డి అంటున్నారు. పార్టీ వీడినందుకు పార్టీ అధినేత్రి సోనియాగాంధీని క్షమాపణ కోరుతున్నానన్నారు. మళ్లీ తిరిగి కాంగ్రెస్ గూటికి చేరుతున్న ఆయన ఢిల్లీలో దిగ్విజయ్ సింగ్ ను కలిశారు. అనంతరం దిగ్విజయ్ మాట్లాడుతూ, బీజేపీలో చేరడం తప్పని జగ్గారెడ్డి ఒప్పుకున్నారన్నారు. ఆయన జిల్లా నేతలు కూడా జగ్గారెడ్డి కాంగ్రెస్ లో చేరడాన్ని సమర్ధిస్తున్నారని చెప్పారు. స్వలాభం కోసమే కొంతమంది కాంగ్రెస్ ను వీడి టీఆర్ఎస్ లో చేరుతున్నారని డిగ్గీ వ్యాఖ్యానించారు.

  • Loading...

More Telugu News