: ఇక సెలవు!... కన్నీటి వీడ్కోలు మధ్య ముగిసిన కలాం అంత్యక్రియలు


వేలాది మంది అభిమానులు, ప్రజలు, రాజకీయ నేతలు, ప్రముఖుల కన్నీటి వీడ్కోలు మధ్య మాజీ రాష్ట్రపతి, క్షిపణి పితామహుడు డాక్టర్ అవుల్ పకీర్ జైనులబ్దీన్ అబ్దుల్ కలామ్ అంత్యక్రియలు ముగిశాయి. ఈ ఉదయం 11:45 గంటల సమయంలో ప్రముఖ నేతలు తుది నివాళులు అర్పించిన తరువాత, ప్రత్యేక ప్రార్థనల మధ్య ముస్లిం సంప్రదాయం ప్రకారం ఆయన పార్థివ దేహాన్ని భూమాత ఒడిలోకి పంపారు. అంతకుముందు సైనిక లాంఛనాల సూచకంగా, గాల్లోకి కాల్పులు జరిపారు. 'కలాం అమర్ రహే' అంటూ అభిమానుల నినాదాలు మిన్నంటాయి. ఆయన అంత్యక్రియలు జరిగే స్థలంలో కలాం స్మారక చిహ్నాన్ని ఏర్పాటు చేస్తామని, స్మృతివనం నిర్మిస్తామని ఇప్పటికే కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన సంగతి తెలిసిందే.

  • Loading...

More Telugu News