: రామేశ్వరం జన సంద్రం... కలాం అంత్యక్రియలకు మోదీ, రాహుల్ హాజరు
భారత రాష్ట్రపతి ఏపీజే అబ్దుల్ కలాం అంత్యక్రియల నేపథ్యంలో ఆయన జన్మస్థలం రామేశ్వరం జన సంద్రంగా మారింది. దేశం గర్వించదగ్గ శాస్త్రవేత్తను కడసారి చూసేందుకు దేశం నలుమూలల నుంచి పెద్ద సంఖ్యలో జనం రామేశ్వరం తరలివచ్చారు. కొద్దిసేపటి క్రితం ప్రారంభమైన కలాం అంతిమ యాత్ర మరికాసేపట్లో పూర్తి కానుంది. కలాం అంత్యక్రియల్లో పాలుపంచుకునేందుకు ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ, కాంగ్రెస్ పార్టీ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ సహా పలువురు కేంద్ర మంత్రులు, పలు రాష్ట్రాల ముఖ్యమంత్రులతో పాటు పలు రంగాలకు చెందిన ప్రముఖులు పెద్ద సంఖ్యలో హాజరయ్యారు.