: మెరైన్ లైన్ లో మెమన్ అంత్యక్రియలు... మహీంలో దుకాణాల మూసివేత


ముంబై బాంబు పేలుళ్ల దోషి యాకుబ్ మెమన్ మృతదేహాన్ని మహారాష్ట్ర పోలీసులు నాగ్ పూర్ నుంచి ముంబైకి తరలిస్తున్నారు. మరికాసేపట్లో అతడి మృతదేహం ముంబైకి చేరుకోనుంది. మహిం ప్రాంతంలోని యాకుబ్ ఇంటికి చేరుకోనున్న అతడి మృతదేహానికి నేడే అంత్యక్రియలు పూర్తి కానున్నాయి. నగరంలోని మెరైన్ లైన్ ప్రాంతంలో అంత్యక్రియలకు సంబంధించిన ఏర్పాట్లు జరుగుతున్నాయి. మెమన్ మృతదేహాన్ని తీసుకువస్తున్న క్రమంలో మహీం ప్రాంతంలోని దుకాణాలన్నింటినీ పోలీసులు మూసివేయించారు.

  • Loading...

More Telugu News