: ఆగస్టు మొదటివారంలో కుటుంబీకులతో చంద్రబాబు విదేశీ పర్యటన
ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు ఆగస్టు మొదటి వారంలో కుటుంబసభ్యులతో కలసి విదేశీ పర్యటనకు వెళ్లబోతున్నారు. ప్రతి సంవత్సరం ఆయన కుటుంబీకులతో వారం రోజుల పాటు విదేశీ పర్యటనలో గడుపుతుంటారు. ఈ నేపథ్యంలోనే ఈసారి కూడా పర్యటనకు వెళ్లనున్నారని తెలిసింది. అయితే ఎక్కడికి వెళుతున్నారనే విషయం తెలియరాలేదు. వ్యక్తిగత పర్యటన తరువాత రాష్ట్రంలో పెట్టుబడుల కోసం మంత్రులు, అధికారులతో సీఎం ఆస్ట్రేలియాలో పర్యటించనున్నారని సమాచారం. దాని తరువాత ఆగస్టు 31 నుంచి సెప్టెంబర్ 4వరకు ఐదు రోజుల పాటు అసెంబ్లీ సమావేశాలు ప్రభుత్వం నిర్వహించే అవకాశం ఉంది.