: ఉగ్రవాద చర్యలకు పాల్పడే వారందరికీ మెమన్ తరహా శిక్షే అమలు చేయాలి: దిగ్విజయ్
యాకుబ్ మెమన్ కు ఉరిశిక్ష అమలుపై కాంగ్రెస్ సీనియర్ నేత దిగ్విజయ్ సింగ్ సోషల్ మీడియాలో స్పందించారు. ఉగ్రవాద చర్యలకు పాల్పడే వారందరికీ మెమన్ కు విధించిన శిక్షనే వర్తింపచేయాలని ట్విట్టర్ లో కోరారు. శిక్ష అమలు విషయంలో అందరి పట్ల కేంద్ర ప్రభుత్వం ఇటువంటి నిబద్ధతే చూపించాలని ఆయన సూచించారు. దాడికి పాల్పడింది ఎవరైనా కులం, మతం, ప్రాంతం అనేవి పట్టించుకోకుండా ప్రభుత్వం, న్యాయస్థానాలు ఇలానే వ్యవహరిస్తాయంటూ డిగ్గీరాజా ఆశాభావం వ్యక్తం చేశారు.