: ఉరి తరువాత ట్విట్టర్లో మెమన్ హల్ చల్!
ముంబై పేలుళ్ల కేసులో ఈ ఉదయం ఉరితీయబడ్డ యాకూబ్ మెమన్ కు సంబంధించిన సమాచారం సామాజిక మాధ్యమాల్లో హల్ చల్ చేస్తోంది. ఈ క్షణం ట్విట్టర్లో 'టాట్ ట్రెండ్' మెమనే. వేలాది మంది నెటిజన్లు యాకూబ్ ను ఉరితీసిన వార్తలు, ఆ తరవాత వస్తున్న సమాచారాన్ని 'షేర్' చేస్తున్నారు. 'యాకూబ్ హ్యాంగ్డ్', 'ఇండియాకా ఇన్ఫాఫ్', 'మెమన్ @ 9ఏఎం' వంటి ట్యాగ్ లైన్లలో వార్తలను పోస్ట్ చేస్తుండగా, ఈ సమాచారాన్ని తెలుసుకునేందుకు సైతం అంతేలా నెటిజన్లు ఆసక్తి చూపుతున్నారు. కాగా, మెమన్ ఉరి నేపథ్యంలో సామాజిక మాధ్యమాలపై పోలీసులు నిఘా పెంచారు. అభ్యంతరకర వ్యాఖ్యలు చేస్తే చర్యలు తప్పవని హెచ్చరించారు. తప్పుడు ప్రచారం చేసిన వారిపై క్రిమినల్ కేసులు పెడతామని స్పష్టం చేశారు.