: మెమన్ పుట్టినరోజు సందర్భంగా జైలుకు కేకు పంపిన కుటుంబీకులు


విధి చాలా విచిత్రమైంది. దాన్నుంచి తప్పించుకోవడం ఎవరికీ సాధ్యం కాదు. యాకుబ్ మెమన్ విషయంలో కూడా అదే జరిగింది. ఈ ఉదయం మెమన్ ను నాగ్ పూర్ సెంట్రల్ జైల్లో ఉరి తీశారు. ఉరికంబం ఎక్కిన ఈ రోజే మెమన్ 53వ పుట్టిన రోజు కూడా. ఈ సందర్భంగా, ఆయన కుటుంబీకులు నాగ్ పూర్ జైలుకు బర్త్ డే కేక్ పంపించారు. అర్ధరాత్రి సమయంలో కేక్ ను జైలు సిబ్బందికి అందించి, పుట్టిన రోజు వేడుక జరపాలని కోరారు. ఆ సమయంలో సుప్రీంకోర్టుకు మెమన్ పెట్టుకున్న పిటిషన్ ఇంకా కొనసాగుతోంది. ఈ నేపథ్యంలో, మెమన్ ప్రాణాలపై వారు అప్పటికీ కొంత ఆశాజనకంగానే ఉన్నట్టు కనపడుతోంది.

  • Loading...

More Telugu News