: యాకుబ్ మృతదేహాన్ని కుటుంబ సభ్యులకు అప్పగించనున్న జైలు అధికారులు
ముంబై పేలుళ్ల దోషి యాకుబ్ మెమన్ మృతదేహాన్ని అతడి కుటుంబ సభ్యులకు అప్పగించే విషయంలో నేటి ఉదయం దాకా కొనసాగిన అయోమయం తొలగిపోయింది. యాకుబ్ మృతదేహానికి పోస్టుమార్టం నిర్వహించిన అనంతరం అతడి కుటుంబ సభ్యులకు అప్పగించేందుకు నాగ్ పూర్ జైలు అధికారులు అంగీకరించారు. ఈ మేరకు మహారాష్ట్ర ప్రభుత్వం జైలు అధికారులకు ఆదేశాలు జారీ చేసింది. నేటి ఉదయం 6.30 గంటలకు యాకుబ్ కు ఉరి శిక్ష అమలైన సంగతి తెలిసిందే. ప్రస్తుతం అతడి మృతదేహానికి నాగ్ పూర్ సెంట్రల్ జైల్లో పోస్టుమార్టం జరుగుతోంది. అది పూర్తి కాగానే మృతదేహాన్ని జైలు అధికారులు అతడి కుటుంబ సభ్యులకు అప్పగించనున్నారు.