: కూతురును చూశాకే... ఉరికంబమెక్కిన యాకుబ్ మెమన్


ముంబై బాంబు పేలుళ్ల దోషి యాకుబ్ మెమన్ చివరి కోరికను నాగ్ పూర్ జైలు అధికారులు తీర్చారు. చివరి కోరిక మేరకు అతడికి కూతురిని చూపించిన జైలు అధికారులు, ఆ తర్వాత ఉరి కంబమెక్కించారు. శిక్ష అమలును నిలుపుదల చేయాలంటూ దాఖలైన యాకుబ్ పిటిషన్ ను అర్ధరాత్రి దాటిన తర్వాత సుప్రీంకోర్టు కొట్టివేసింది. దీంతో యాకుబ్ ఉరిపై అతడి కుటుంబ సభ్యులకు సమాచారం అందించిన జైలు అధికారులు వారిని జైలుకు పిలిపించారు. ఆ తర్వాత కూతురుతో పాటు కుటుంబ సభ్యులను కూడా యాకుబ్ కలుసుకున్నాడు. వారితో కొద్దిసేపు మాట్లాడాడు. ఆ తర్వాత జైలు అధికారులు అతడిని ఉరి కంబమెక్కించారు.

  • Loading...

More Telugu News