: కూతురిని చూడాలనుందన్న యాకూబ్... నాగ్ పూర్ జైలు వద్దకు కుటుంబ సభ్యులు


ఉరిశిక్ష అమలు చేసే ముందు ఖైదీల చివరి కోరిక తీర్చడం జైలు అధికారుల బాధ్యత. ముంబై పేలుళ్ల కేసులో దోషిగా తేలి మరికొద్దిసేపట్లో ఉరికంబమెక్కనున్న యాకుబ్ మెమన్ ను కూడా జైలు అధికారులు అతడి చివరి కోరిక ఏమిటని ప్రశ్నించారు. తన కూతురును చూడాలనుందని యాకుబ్ చెప్పాడు. అయితే నిబంధనలు ఇందుకు అంగీకరిస్తాయా? లేదా? అన్న విషయంపై జైలు అధికారులు మల్లగుల్లాలు పడుతున్నారు. ఇదిలా ఉంటే, యాకుబ్ కు నేటి ఉదయం 7 గంటలకు ఉరిశిక్ష అమలు చేయనున్నట్లు జైలు అధికారులు అతడి కుటుంబ సభ్యులకు అర్ధరాత్రి దాటిన తర్వాత తెలియజేశారు. దీంతో తీవ్ర వేదనలో కూరుకుపోయిన యాకుబ్ కుటుంబ సభ్యులు కొద్దిసేపటి క్రితం నాగ్ పూర్ సెంట్రల్ జైలు వద్దకు చేరుకున్నారు. మరి యాకుబ్ చివరి కోరికను జైలు అధికారులు తీరుస్తారో, లేదో చూడాలి.

  • Loading...

More Telugu News