: రాష్ట్రపతితో రాజ్ నాథ్ భేటీ


యాకూబ్ మెమన్ ఉరిశిక్ష రద్దు చేయాలంటూ రాష్ట్రపతికి పెట్టుకున్న క్షమాభిక్ష పిటిషన్ పై కాసేపట్లో నిర్ణయం తీసుకోనున్నారు. ఉరిశిక్ష పడిన వ్యక్తి క్షమాభిక్ష కోసం పిటిషన్ పెట్టుకుంటే, రాష్ట్రపతి దానిని పరిశీలించిన తరువాత కేంద్ర హోం శాఖకు పంపి అభిప్రాయం తెలుసుకుంటారు. అనంతరం విచక్షణాధికారాల ప్రకారం ఆయన నిర్ణయం తీసుకుంటారు. ఈ నేపధ్యంలో గురువారం ఉదయం యాకూబ్ మెమన్ ఉరిశిక్ష అమలు నేపథ్యంలో మెమన్ క్షమాభిక్ష పిటిషన్ రాష్ట్రపతి వద్దకు చేరింది. దీంతో ఆయన కేంద్ర హోం శాఖకు ఆ ఫైలును పంపారు. ఈ నేపథ్యంలో రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ నివాసానికి కేంద్ర హోం మంత్రి రాజ్ నాథ్ సింగ్ వెళ్లారు. ఈ సందర్భంగా ప్రణబ్ ముఖర్జీ, మెమన్ క్షమాభిక్షపై రాజ్ నాథ్ తో చర్చిస్తున్నారు. కాసేపట్లో క్షమాభిక్షపై రాష్ట్రపతి నిర్ణయం ప్రకటించనున్నారు.

  • Loading...

More Telugu News