: గత ఏడేళ్లలో ఏ సినిమాకీ ఇలాంటి స్పందన చూడలేదు: పాకిస్థాన్ ఎగ్జిబిటర్
ఏడేళ్లుగా సినిమా వ్యాపారంలో ఉన్నా ఎన్నడూ ఇలాంటి స్పందన చూడలేదని 'భజరంగీ భాయ్ జాన్' చిత్రాన్ని ఉద్దేశించి పాకిస్థాన్ సినిమా థియేటర్ ఓనర్ (ఎగ్జిబిటర్) ఒకరు వ్యాఖ్యానించారు. సల్మాన్ ఖాన్, కరీనా కపూర్ జంటగా నటించిన ఈ సినిమా వారం రోజుల క్రితం పాకిస్థాన్ లో విడుదలైంది. అయినా దీనికి ఇంకా ఆదరణ తగ్గడం లేదు. సినిమా చూసిన అనంతరం థియేటర్ నుంచి జనం ఏడుస్తూ వస్తున్నారని ఆయన పేర్కొన్నారు. లాహోర్ లో ఏడేళ్లుగా సినిమా థియేటర్ నడుపుతున్నానని, గతంలో ఎప్పుడూ ఇలా జరగలేదని ఆయన అభిప్రాయపడ్డారు. చిన్నాపెద్దా అన్న తేడా లేకుండా ప్రేక్షకులు వస్తున్నారని, కొంత మంది యువకులు మళ్లీ మళ్లీ సినిమా చూసేందుకు వస్తున్నారని, 'భజరంగీ భాయ్ జాన్'కు రోజురోజుకూ ఆదరణ పెరుగుతోందని ఆయన పేర్కొన్నారు.