: పీవీ మాట... ఫడ్నవీస్ నోట


చట్టం తన పని తాను చేసుకుపోతుంది... మాజీ ప్రధాని పీవీ నరసింహారావు మాటగా కీర్తి గడించిన ఈ మాట ఇప్పుడు మహారాష్ట్ర ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్ నోట వెలువడింది. ముంబైలో ఆయన మాట్లాడుతూ, బొంబాయి పేలుళ్ల దోషి యాకూబ్ మెమన్ ఉరిశిక్షపై ఆయన మాట్లాడుతూ, చట్టం తనపని తాను చేసుకుపోతుందని అన్నారు. కాగా, నేడు మహారాష్ట్ర శాసనసభ యాకూబ్ మెమన్ ఉరిపై దద్దరిల్లిన సంగతి తెలిసిందే. ప్రధాన నిందితుడు పరారీలో ఉండగా, యాకూబ్ మెమన్ ను ఎలా ఉరితీస్తారంటూ కాంగ్రెస్ నేతలు మండిపడగా, చట్టవ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడేవారిని, దేశ భద్రతకు ముప్పుకలిగేలా వ్యవహరించేవారిని చూస్తూ ఊరుకోమని బీజేపీ నేతలు దీటుగా సమాధానమిచ్చిన సంగతి తెలిసిందే.

  • Loading...

More Telugu News