: సీఎంకు చంద్రబాబు లేఖ
రాష్ట్ర ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డికి తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు నేడు లేఖాస్త్రం సంధించారు. విశాఖ జిల్లాలోని కసింకోట మండలం తాళ్ళపాలెం వద్ద గల టెర్న్ కర్మాగారం నుంచి వెలువడుతున్న కాలుష్యాన్ని అరికట్టాలంటూ బాబు తన లేఖలో పేర్కొన్నారు. బాబు ప్రస్తుతం విశాఖ జిల్లాలో పాదయాత్ర చేస్తున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, దున్నపోతులాంటి కాంగ్రెస్ పార్టీని ఎన్నుకుని ప్రజలు కష్టాల పాలయ్యారని వ్యాఖ్యానించారు. కాంగ్రెస్ పాలనలో ధరలు చుక్కలనంటుతున్నాయని అన్నారు.