: కలాంను కలవలేకపోయానంటూ విచారం వ్యక్తం చేసిన సల్మాన్
మాజీ రాష్ట్రపతి అబ్దుల్ కలాం మృతి పట్ల బాలీవుడ్ నటుడు సల్మాన్ ఖాన్ ట్విట్టర్లో స్పందించారు. తాను కలాంను కలవాలనుకున్నప్పటికీ కలవలేకపోయానని విచారం వ్యక్తం చేశారు. ఆయనను మిస్ అయ్యానని పేర్కొన్నారు. కలాం సాబ్ ను కలిసి ఉంటే బాగుండేదని అభిప్రాయపడ్డారు. ఎవరినైనా కలవాలని మీ మనసు కోరుకుంటే ఆలస్యం చేయవద్దని, వెంటనే వెళ్లి కలవాలని సూచించారు. ఇక, కలాం గొప్ప శాస్త్రవేత్త అని సల్మాన్ కొనియాడారు. ఆయనలో ఓ గొప్ప టీచరే కాదు, ఓ మంచి విద్యార్థి కూడా ఉన్నాడని పేర్కొన్నారు.