: ఏపీలో పనులింత నిదానమా?... ఆశ్చర్యపోయిన జపాన్ బృందం


విజయనగరం జిల్లాలో పర్యటించిన జపాన్ బృందం, అభివృద్ధి పనులు జరుగుతున్న తీరును పరిశీలించి ఆశ్చర్యపోయింది. నిధులున్నప్పటికీ, పనులు నత్తనడకన సాగుతున్నాయని తెలుసుకుని అవాక్కయింది. జిల్లాలోని గంత్యాడ, ఎస్ కోట మండలాల పరిధిలో 15 వేల ఎకరాలకు సాగునీరందించే లక్ష్యంతో తలపెట్టిన ప్రాజెక్టును నేడు జపాన్ బృందం సందర్శించింది. 2011లో ప్రాజెక్టు పనులు ప్రారంభమైనాయని తెలుసుకుని ఆశ్చర్యపోయిన జపాన్ అధికారులు, ఏపీలో పనులింత నిదానమా? అని ప్రశ్నించారు. రూ. 23 కోట్లు మంజూరై నిధులున్నప్పటికీ, పనుల్లో ఇంత ఆలస్యం ఎందుకు జరుగుతోందని వారు అడిగారు. దీనికి సమాధానం చెప్పడానికి జిల్లా ఇరిగేషన్ అధికారులు నీళ్లునమలడం కొసమెరుపు.

  • Loading...

More Telugu News