: మెమెన్ క్షమాభిక్ష పిటిషన్ ను తిరస్కరించిన మహారాష్ట్ర గవర్నర్
ముంబై బాంబు పేలుళ్ల కేసులో ఉరిశిక్ష పడ్డ యాకుబ్ మెమెన్ పెట్టుకున్న క్షమాభిక్ష పిటిషన్ ను మహారాష్ట్ర గవర్నర్ విద్యాసాగర్ రావు తిరస్కరించారు. దీనికితోడు, అతను పెట్టుకున్న క్యూరేటివ్ పిటిషన్ ను కాసేపటి క్రితం సుప్రీంకోర్టు కూడా తిరస్కరించింది. దీనికి సంబంధించి సుప్రీం కాసేపట్లో తుది తీర్పు వెలువరించనుంది. మరోవైపు, ఈ ఉదయం భారత రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీకి మెమెన్ పెట్టుకున్న క్షమాభిక్ష పిటిషన్ మాత్రం ఇంకా పెండింగ్ లో ఉంది. అయితే, ఇప్పటికే మెమెన్ క్షమాభిక్ష పిటిషన్ ను తిరస్కరించిన రాష్ట్రపతి... తాజా పిటిషన్ ను కూడా తిరస్కరించడానికే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో, యాకుబ్ మెమెన్ ను రేపు ఉదయం ఉరితీసే అవకాశాలే ఎక్కువగా కనబడుతున్నాయి.