: తాలిబాన్ అధినేత ముల్లా ఒమర్ మృతి
తాలిబాన్ ఉగ్రవాద సంస్థ అధినేత, మోస్ట్ వాంటెడ్ టెర్రరిస్ట్ ముల్లా ఒమర్ చనిపోయాడు. ఈ మేరకు ప్రముఖ మీడియా సంస్థ బీబీసీ ఓ కథనంలో స్పష్టం చేసింది. ఆఫ్ఘనిస్థాన్ అధికారులు ఈ విషయాన్ని వెల్లడించినట్టు బీబీసీ తెలిపింది. అయితే, ఈ వార్తను తాలిబాన్ వర్గాలు ఇంతవరకు ధ్రువీకరించలేదు. తాలిబన్ అధికార ప్రతినిధిని ఈ మేరకు తాము సంప్రదించగా... ఈ విషయంపై త్వరలోనే ఓ స్టేట్ మెంట్ విడుదల చేస్తామని చెప్పినట్టు తెలిపింది. అయితే, రెండు, మూడేళ్ల క్రితమే ముల్లా ఒమర్ మృత్యువాత పడినట్టు వార్తలు వచ్చాయి. దీనికి సంబంధించి ఎన్నో రిపోర్టులు కూడా వచ్చాయి. అయితే, అధికారికంగా ఇప్పటిదాకా ఎలాంటి ప్రకటన వెలువడలేదు. తొలిసారిగా ఆఫ్ఘన్ ప్రభుత్వంలోని ఉన్నతాధికారి ఈ విషయాన్ని ధ్రువీకరించారని బీబీసీ తెలిపింది.