: మెమన్ ను ఉరితీయాల్సిందేనంటున్న బాధిత కుటుంబాలు


ముంబయి వరుస పేలుళ్ల కేసులో యాకూబ్ మెమన్ ను ఉరితీయాల్సిందేనని బాధిత కుటుంబాలు ఘోషిస్తున్నాయి. వందల ప్రాణాలను పొట్టనబెట్టుకున్న రాక్షసుడు మెమన్ పై కరుణ చూపరాదని స్పష్టం చేస్తున్నాయి. ఈ మేరకు బాధిత కుటుంబాలకు చెందినవారు మహారాష్ట్ర ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్ ను కలిసి విజ్ఞప్తి చేశారు. మెమన్ కు ఉరిశిక్షే సరైనదని వారు ముక్తకంఠంతో నినదించారు. కాగా, మెమన్ ను ఈ నెల 30న ఉరితీసేందుకు నాగ్ పూర్ సెంట్రల్ జైలులో ఏర్పాట్లు చేశారు. మెమన్ దాఖలు చేసిన పిటిషన్ పై సుప్రీం కోర్టు నిర్ణయం వెలువరించాల్సి ఉంది.

  • Loading...

More Telugu News