: శ్రీశాంత్ ఆశలపై నీళ్లు చల్లిన బీసీసీఐ


స్పాట్ ఫిక్సింగ్ కేసులో నిర్దోషిగా బయటపడి, మళ్లీ ఇండియా తరపున ఆడాలనుకుంటున్న క్రికెటర్ శ్రీశాంత్ ఆశలపై బీసీసీఐ నీళ్లు చల్లింది. శ్రీశాంత్ తో పాటు అంకిత్ చవాన్ పై విధించిన నిషేధాన్ని ఎత్తివేయబోమని బీసీసీఐ కార్యదర్శి ఠాకూర్ స్పష్టం చేశారు. ఆటగాళ్లపై క్రమశిక్షణ చర్యల్లో భాగంగా బీసీసీఐ తీసుకున్న నిర్ణయం అమల్లోనే ఉంటుందని ఆయన చెప్పారు. చట్టపరమైన చర్యలకు, బోర్డు తీసుకున్న క్రమశిక్షణ చర్యలకు సంబంధం ఉండదని తెలిపారు. ఈ క్రమంలో శ్రీశాంత్ పై ఉన్న నిషేధాన్ని ఎత్తివేయాలని కేరళ క్రికెట్ సంఘం చేసిన విన్నపాన్ని బీసీసీఐ తిరస్కరించింది.

  • Loading...

More Telugu News