: దీనానగర్ ముష్కరులు పాక్ నుంచే వచ్చారు... సీసీటీవీ ఫుటేజీల్లో బహిర్గతం


పంజాబ్ లోని గురుదాస్ పూర్ జిల్లా దీనానగర్ లో విధ్వంసానికి తెగబడ్డ ముష్కరులు పాకిస్థాన్ నుంచే దేశంలోకి చొరబడ్డారు. ఈ మేరకు పాక్ సరిహద్దు నుంచి వారు భారత భూభాగంలోకి చొరబడుతున్న దృశ్యాలను జాతీయ వార్తా చానెల్ ‘సీఎన్ఎన్-ఐబీఎన్’ ప్రసారం చేసింది. పాక్ భూభాగం నుంచి ఈ నెల 27న తెల్లవారుజామున 4.30 గంటల సమయంలో అంతర్జాతీయ సరిహద్దు దాటి భారత భూభాగంలోకి ప్రవేశించిన ఉగ్రవాదులు అటుగా వెళుతున్న బస్సుపై తొలుత కాల్పులు జరిపారు. ఆ తర్వాత దీనానగర్ పోలీస్ స్టేషన్ పై మూకుమ్మడి దాడి చేశారు. క్షణాల్లో మేల్కొన్న పోలీసులు ఉగ్రవాదులకు ముకుతాడు వేశారు. ఈ సందర్భంగా గంటల తరబడి జరిగిన కాల్పుల్లో నలుగురు పోలీసులు సహా ఏడుగురు చనిపోగా, పోలీసుల చేతిలో ఉగ్రవాదులు హతమయ్యారు.

  • Loading...

More Telugu News