: ఆలస్యంగా వెలుగులోకి... అట్లాంటాలో ఈతకు వెళ్లి, ప్రకాశం జిల్లా యువకుడి మృతి


అమెరికాలోని అట్లాంటా నగరంలో ఓ తెలుగు యువకుడు మరణించిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ప్రకాశం జిల్లా పర్చూరు మండలం అన్నంబొట్లవారి పాలెం గ్రామానికి చెందిన చిలుకూరి కౌశిక్ అమెరికాలో సాఫ్ట్ వేర్ ఇంజినీర్ గా పనిచేస్తున్నాడు. అట్లాంటాలోని ఓ నదిలో ఈతకు వెళ్లిన అతను ప్రమాదవశాత్తు మృతి చెందాడని తెలిసింది. రెండు రోజుల కిందటే అతడు చనిపోయినప్పటికీ ఈ వార్త ఆలస్యంగా తెలియడం గమనార్హం. కుమారుడి మరణవార్త తెలిసి స్వగ్రామంలో తల్లిదండ్రులు కన్నీరుమున్నీరవుతున్నారు.

  • Loading...

More Telugu News