: నాన్న, పిన్నిని కఠినంగా శిక్షించాల్సిందే...ఆస్పత్రి నుంచి డిశ్చార్జి అయిన ప్రత్యూష
హైదరాబాదులో కన్నతండ్రి, సవతి తల్లి చేతుల్లో చిత్రహింసలకు గురైన బాలిక ప్రత్యూష కొద్దిసేపటి క్రితం ఆస్పత్రి నుంచి డిశ్చార్జి అయ్యింది. ఈ సందర్భంగా బాలిక మీడియాతో మాట్లాడుతూ తనను చిత్రహింసలకు గురి చేసిన తండ్రి, సవతి తల్లిలను కఠినంగా శిక్షించాలని కోరింది. ఇదే విషయాన్ని కోర్టుకు విన్నవిస్తానని వెల్లడించింది. బీఎస్సీ నర్సింగ్ కోర్సు చదవాలని ఉందని చెప్పిన ప్రత్యూష, బంధువుల వద్ద ఉండేందుకు ససేమిరా అంది. హాస్టల్ లోనే ఉండి చదువుకుంటానని చెప్పింది. హైకోర్టు ధర్మాసనం ఆదేశాల మేరకు పోలీసులు ఆమెను కొద్దిసేపట్లో కోర్టులో హాజరుపరచనున్నారు.