: అమర్ నాథ్ యాత్రికులపై గ్రెనేడ్ దాడి!


పంజాబ్ లోని గురుదాస్ పూర్ పై ఉగ్రవాదుల దాడి ఘటనను మరవకముందే ముష్కరులు మరోసారి తెగబడ్డారు. హిమాలయాల్లో కొలువుదీరిన స్వయంభూ ఈశ్వర ప్రతిరూపం అమరనాథుని దర్శనానికి వెళ్తున్న భక్తులను లక్ష్యంగా చేసుకున్నారు. ఈ ఉదయం అమర్ నాథ్ యాత్ర మార్గంలో ఉగ్రవాదులు దాడి చేశారు. అనంతనాగ్ నుంచి పహల్గాం వెళ్లే మార్గంలో గ్రెనేడ్ లు విసిరారు. ఈ ఘటనలో ఇద్దరు సీఆర్పీఎఫ్ జవాన్లకు గాయాలైనట్టు ప్రాథమిక సమాచారం. గాయపడిన సైనికులను హెలికాప్టరులో అనంతనాగ్ ఆసుపత్రికి తరలించారు. యాత్రికులు ఎవరికైనా గాయాలయ్యాయా? అన్న వివరాలు అందలేదు. ఘటనపై పూర్తి సమాచారం తెలియాల్సి వుంది.

  • Loading...

More Telugu News