: తూర్పు గోదావరి జిల్లాలో మావోల భారీ డంప్... గ్రెనేడ్లు, రాకెట్ లాంచర్లు లభ్యం


రాష్ట్ర విభజనకు ముందు దాదాపుగా కనుమరుగైన మావోయిస్టులు... రాష్ట్ర విభజన తర్వాత రెండు తెలుగు రాష్ట్రాల్లో మళ్లీ తిరిగి ప్రాబల్యం పెంచుకునే దిశగా అడుగులేస్తున్నారు. ఇప్పటికే తెలంగాణలోని పలు జిల్లాల్లో తమ ఉనికిని చాటుకుంటున్నారు. తాజాగా నేటి ఉదయం ఏపీలోని గుంటూరు జిల్లాలోని పల్నాడు ప్రాంతంలో మావోల పోస్టర్లు దర్శనమిచ్చాయి. కొద్దిసేపటి క్రితం తూర్పుగోదావరి జిల్లాలో మావోలకు చెందిన భారీ డంప్ ను పోలీసులు కనుగొన్నారు. జిల్లాలోని వై.రామవరం మండలం డొంకరాయి సమీపంలో వెలుగుచూసిన ఈ డంప్ లో అత్యాధునిక గ్రెనేడ్లు, రాకెట్ లాంచర్లతో పాటు పెద్ద ఎత్తున మందుగుండు సామగ్రిని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. మావోల డంప్ లో రాకెట్ లాంచర్లు బయటపడటంతో పోలీసులు షాక్ కు గురయ్యారు.

  • Loading...

More Telugu News